

ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని మండల ఎస్సై సాకాపురం దివ్య ప్రజలకు సూచించారు.బుధవారం సైబర్ నేరాలపై కొత్తపల్లి గోరి మండల కేంద్రంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఎస్సై మాట్లాడుతూ…సైబర్ నేరాలు జరిగే విధానాన్ని గ్రామస్తులకు వివరించారు.వాట్సాప్ లో బ్యాంక్, తదితర హైపర్ లింక్ లను ఓపెన్ చేయవద్దని,వ్యాపారం,పెట్టుబడి, పార్ట్ టైమ్ ఉద్యోగాలు,గుర్తింపు, అనధికార క్రెడిట్ కార్డ్ వినియోగం, రుణ మోసాలు,నకిలీ రుణ యాప్లు,ఆర్థిక ఉచ్చుల ప్రకటన,ఆన్లైన్లో డెలివరీ చేయని వస్తువులు,సేవలు, ఆన్లైన్ భద్రతా చిట్కాలు,డిజిటల్ ప్రపంచంలో స్వీయ రక్షణ వంటి విషయాలను గురించి ఎస్సై అవగాహన కల్పించారు.
ఇంటర్నెట్లో మోసగాళ్లు రుణ గ్రహీతలను లక్ష్యంగా చేసుకుని, తాము బ్యాంకులు,చట్టబద్ధమైన డిజిటల్ లెండింగ్ సంస్థల ప్రతినిధులమని చెప్పి వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, వేతన గిరాకీ పత్రాలు పొందేందుకు ప్రయత్నిస్తారని అటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు సిబ్బంది తో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.