
ఈరోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కడియం శ్రీహరి
నామినేషన్ వేసిన సందర్భంగా భారీగా తలివచ్చిన అశేష జనవాహిని
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
విశిష్ట అతిథులుగా
జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ పాగాల సంపత్ రెడ్డి .
రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు శ్రీ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు.
అనంతరం కడియం శ్రీహరి మట్లాడుతూ…
👉 నామీద అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఈ జనప్రవాహాన్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.
👉 నాకు రాజకీయ జన్మనిచ్చిన ఈ స్టేషన్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది.
దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి గ్రామాలను,నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు.
👉 ఈ జన ప్రవాహాన్ని చూస్తుంటే 30తేదీన జరగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసిఆర్ నాయకత్వములో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయం అని ఈ సందర్బంగా తెలియజేస్తున్నాను అన్నారు.
👉 మీ ఆశీర్వాదంతో 30 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నాను.
అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రస్తుతం MLC గా ఉన్నాను.
ఈ 30 సంవత్సరాలలో నేను నీతి, నిజాయితీగా పని చేసాను నియోజకవర్గ అభివృద్ధి కొరకు కృషి చేసాను, ఏనాడూ అవినీతికి పాల్పడలేదు ,అక్రమాలకు పాల్పడలేదు , తప్పుడు పనులు చేయలేదు నన్ను ఎన్నుకున్న ప్రజలకు తలవంపులు తీసుకురాలేదు అన్నారు.
👉 నేను గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంలో రైతులు, యువకులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.
కేసిఆర్ గారు అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలు అనుభవిస్తున్నారు.
ప్రజలు మళ్ళీ BRS పార్టీకే పట్టం కట్టాలి అని సిద్దంగా ఉన్నారు అని అన్నారు.
👉 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎన్నికలప్పుడే కనిపించే కాంగ్రెస్ నాయకులు ఏదెదో మాట్లాడుతున్నారు.
నియోజకవర్గంలో గ్రామాల పేర్లు తెలియని వాళ్లు, ఏ మండలములో ఏ తండా ఎక్కడ ఉందో తెలియని వాళ్లు ,స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ఆలోచన లేని వాళ్ళు, మనకు అందుబాటులో ఉండని వాళ్లు హైదరాబాద్ లో ఉండే వాళ్లు మనకు అవసరమా అని అన్నారు.
👉 నేను మీకు మాట ఇస్తున్నాను మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించి 30 వ తేదిన కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఐదేండ్లు మీకు సేవ చేసుకుంటాను, మీకు సేవకుడిగా ఉంటాను అని అన్నారు.
👉 నాకు ఒక ప్రణాళిక ఉన్నది ఘనపురం, శివునిపల్లి, చాగల్లు కలిపి మున్సిపాలిటీ చేసి వందల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు.
👉 వందకు వంద శాతం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికీ రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత నాది అన్నారు.
👉 మరొక్కసారి అవకాశం ఇవ్వండి మీ అందరి భాగస్వామ్యంతో గ్రామాల వారిగా, మండలాల వారిగా, నియోజకవర్గ వారిగా కేసిఆర్ గారి దగ్గరి నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేసే భాధ్యత నాది అన్నారు.
👉 ఇక్కడికి వచ్చిన ప్రతీ కార్యకర్తను, ప్రతీ ఓటరును , ప్రజలను ఈ నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడు కుంటాను.
దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించండి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసే భాగ్యాన్ని కల్పించండి అని కోరారు.
👉 నాకు ఉన్న అనుభవాన్ని, పలుకుబడిని ఈ నియోజకర్గ అభివృద్దికే ఉపయోగిస్తాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో
మాజి ఎమ్మెల్యే ఆరోగ్యం , బొల్లేపల్లి కృష్ణ , మధాసు వెంకటేశ్ , చింత జగదీష్ , ఎంపీపీలు, జెడ్పీటీసీ లు, మండల పార్టీ అధ్యక్షులు, రైతు సమన్వయ సమితి జిల్లా, మండల, గ్రామ కో ఆర్డినేటర్ లు, మార్కెట్ దేవస్థాన,PACS చైర్మన్ లు, డైరక్టర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, గ్రామశాఖ అధ్యక్షుల, క్లస్టర్ ఇంచార్జ్ లు, సభ్యులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.