
telugu galam e69news local news station ghanpur news
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలానికి నూతన ఎస్సైగా వచ్చిన బొల్లం వినయ్ కుమార్ బుధవారం విధుల్లో చేరారు.ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ..శాంతి భద్రతల పరి రక్షణకు మండల ప్రజలు సహకరించాలని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకొచ్చి పరిష్కారం చేసుకోవాలని తెలిపారు.ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.