
స్థానిక ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా నిరంతర పోరాటం
జఫర్గడ్ మండలం ఉప్పుగళ్లు గ్రామంలో సిపిఐ పార్టీ సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు,మండల కార్యదర్శి జువారి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటే సిపిఐను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలన్నారు.బుధవారం జరిగిన ఈ సమావేశానికి పెండ్యాల సమ్మయ్య అధ్యక్షత వహించారు.కొత్తగా పార్టీలో చేరిన యువకులను కండువాలు కప్పి ఆహ్వానించిన జువారి రమేష్,యువత రాజకీయ చైతన్యం పెంపొందించి సమాజంలో సానుకూల మార్పుకు పనిచేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో అన్నెపు అజయ్,ఎం.డి.జాఫర్,మంద బుచ్చయ్య,సాయిలు,ఎర్రం సతీష్,ఎర్రం మధు,శంకర్,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.బుధవారం ఉప్పుగళ్లు గ్రామానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున సిపిఐలో చేరారు.గాడుదుల రమేష్,కొమురయ్య,కృష్ణ,సతీష్,గదేపాక శ్రీశాంత్,రాజేష్,గదేపాక రంజిత్‌కుమార్,శ్రీకాంత్,గుండె రాజేష్,శివరాత్రి సతీష్,గంగాదరి చంద్రశేఖర్,జి.శ్రీకాంత్,చిన్న శ్రీనివాస్,గదేపాక మామిడ్ల అరుణ్‌కుమార్,శివకుమార్,ఎర్రం శివ,బొల్లిపెళ్లి సాయి,నల్లబోయినా వరుణ్,కస్తూరి ప్రవీణ్,కానిగంటి గణేష్,ఎర్రం శివతో పాటు 25 కుటుంబాలు పార్టీలో చేరాయి.పార్టీ నేతల ప్రకారం,ఈ చేరికలతో జఫర్ఘఢ్ మండలంలో సిపిఐ మరింత బలపడిందని అన్నారు.