
16/12/2022
ఈ 69న్యూస్
వరంగల్
మేము కొండపర్తి జామ మస్జిద్ కమిటి సభ్యులము మరియు ప్రెసిడెంట్, కొండపర్తి, ఐనవోలు మండలం, హన్మకొండ జిల్లా మీతో మనవి చేయునది ‘ఏమనగా,
కొండపర్తి గ్రామంలోని ముస్లిం స్మశాన వాటిక స్వాతంత్య్రానికి పూర్వం నుండి ఉన్నది. ఇట్టి స్మశాన వాటిక సర్వే నెం. 1434 లో మొత్తం ఎ. 3-39 గుంటల భూమిలో ఉన్నది. ఇట్టి “ఖబరస్తాన్” రెవెన్యూ రికార్డులలో 2009 వరకు ఉన్నది. కాని కొంతమంది ఇట్టి స్మశాన వాటికలో ఎ. 0-20 గుంటల భూమిని రైతు వేధిక సాకుతో ఖబ్జా చేసినారు. ఇట్టి విషయమై. మేము అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి, వక్స్ బోర్డు వారికి పలుమార్లు దరఖాస్తులు ఇచ్చినాము, కాని ఎవ్వరు ఇట్టి విషయమై పట్టించుకోవడం లేదు.
వర్ఫ్ బోర్డు, హైదరాబాద్ వారు “ఖబరస్తాన్” భూమి అని F.No. S-95/WGL/2022, Dt.22-08-2022 ద్వారా జిల్లా కలెక్టర్ హన్మకొండ గారికి ప్రొసీడింగ్స్ ఇవ్వమని రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినారు. కాని జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా గత 3 నెలల నుండి త్రిప్పుచున్నారు.
తేది : 10-12-2022 శనివారం రోజున గుర్తు తెలియని వ్యక్తులు పైన తెలిపిన స్మశాన భూమిలోకి వచ్చి సమాధులను త్రవ్వి ఖబ్జా చేయడానికి ప్రయత్నం చేయుచున్నారు. ఈవిధంగా ఎన్నోసార్లు జరిగినది. ఇట్టి విషయం గ్రామ కార్యదర్శికి, గ్రామ సర్పంచి గారికి, జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగినది.
ప్రస్తుతం ధరణి పోర్టల్లో ఖబరస్తాన్ భూమికి బదులుగా నివాస గృహములు అని తప్పుగా చూపెడుతుంది. ఇట్టి భూమిని గ్రామ నాయకులు, అక్రమదారులు ఖబ్జా చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేయుచున్నారు.
ఇట్టి ఖబరస్తాన్ కాకతీయుల కాలం నుండి ఉన్నది. గత 2010 సంవత్సరం నుండి రెవెన్యూ రికార్డులలో ఖబరస్తాన్ భూమి అని తొలగించి నివాస గృహాలుగా మార్చివేసినారు.
కావున దయచేసి ఇట్టి స్మశాన వాటిక భూమిని ఖబ్జా కాకుండా ధరణి పోర్టల్లో సరిచేసి ఖబరస్తాన్ భూమిగా మాకు ప్రొసీడింగ్స్ ఇప్పించి న్యాయం చేయగలరని మనవి చేయుచున్నాము. అని తెలియజేశారు