
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు ఎర్త్ అవర్ ను పాటించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లోని అన్ని కార్యాలయాలు,ప్రభుత్వ ఆఫీసులు రాత్రి 08:30 నుండి 9:30 గంటల వరకు ఎర్త్ అవర్ ను పాటిస్తూ విద్యుత్తు లైట్లను,ఫ్యాన్లను నిలిపివేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో ఎర్త్ అవర్ ను ఒక గంట పాటు పాటించినట్లు అధికారులు పేర్కొన్నారు.