ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇర్రి అహల్య హింస నిర్మూలన దినోత్సవం నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ మానవ హక్కుల దివరకు 16 రోజులు హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఐద్వా జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శ్రీ గాయత్రి జూనియర్ కాలేజీలో సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇర్రి అహల్య జిల్లా కార్యదర్శి ఎండి షబానా పాల్గొని మాట్లాడారు మహిళలపై జరుగుతున్న అన్ని రకాల హింసలను వివక్షను రూపుమాపాలని ఐక్యరాజ్యసమితి 1979 సంవత్సరంలో సమావేశం ఏర్పాటు చేశారు 19 93లో ఆమోదం తెలుపుతూ 2000 సంవత్సరం నుండి అధికారికంగా అన్ని దేశాలకు పిలుపునిచ్చిందన్నారు ప్రపంచవ్యాప్తంగా మహిళలు శారీరకంగా మానసికంగా వివక్షతలకు ఆర్థిక అణిచివేతకు గురవుతున్నారు భారతదేశంలో మహిళలకు రక్షణ కల్పిం కల్పించే దేశం కాదని ప్రపంచ వేదికల మీద చర్చలు జరుగుతున్నాయి ప్రతి ఏటా మహిళలపై హింస పెరుగుతున్న రోజుకు 86 అత్యాచారాలు సగటు గంటకి 49 నేరాలు మహిళలపై జరుగుతున్నాయని 77 నిమిషా లకు ఒక వరకట్న హత్య ప్రతి 48 నిమిషాలకి దళిత మహిళ అత్యాచారానికి గురవుతున్నారని ప్రభుత్వ నివేదికగా చెప్తున్నా అన్నారు హింసకి ప్రధాన కారణాలు మద్యం మాదకద్రవ్యాలు వంటి మత్తు పదార్థాల కు బానిసలవుతున్నారు ఫోర్నోగ్రఫీ ప్రభావం స్త్రీలను బలహీనులుగా చులకనగా చూసే అటువంటి సమాజ ప్రభావం వల్ల మహిళలపై హింస పెరుగుతుందన్నారు మహిళలు అన్ని రంగాల్లో విద్య ఉద్యోగం ఆటల్లో రాజకీయాల్లో ముందుకు దూసుకెళ్తున్న ఇంకా వివక్ష కొనసాగుతుందని పసి పిల్లలపై వృద్ధ మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోతున్నాయన్నారు పోరాడి సాధించుకున్న చట్టాలను పకడ్బందీగా ప్రభుత్వాలు అమలు చేయట్లేదు అన్న రూ ంసా నుండి బయటపడటానికి ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలకి మహిళా సంఘాలకు ఎన్జీవో సంఘాలకు మహిళలకు అవగాహన కల్పించాలి పిలుపునిచ్చింది కానీ మహిళలకు భద్రత కల్పించడంలో హింస నీ అరికట్టడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదన్నారు అశ్లీల చిత్రాలను పోర్నోగ్రఫీ నీ షేదించాలని చట్టాలను పకడ్బందీగా అమలయ్యే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు హింస లేని సమాజం కోసం ఐక్యమై మహిళలు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐద్వ జిల్లా సహాయ కార్యదర్శి మోకు భవాని కమిటీ సభ్యు రాలు చింతల శ్రీలత విద్యార్థినులు పాల్గొన్నారు