
👉ఈ రోజు హైదరాబాదులో శామీర్ పేట్ లో :- బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు హుజూరాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఈటెల రాజేందర్ గారి నివాసంలో, స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారి ఆధ్వర్యంలో బిజెపి పార్టీ లో చేరారు.
👉ఎమ్మెల్యే శ్రీ ఈటెల రాజేందర్ గారు బిజెపి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి,ప్రతి కార్యకర్త బిజెపి పథకాలను మరియు కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను,నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజయ్య చేస్తున్న అవినీతి పాలనను ప్రజలలోకి తీసుకెళ్లి,బిజెపి బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
👉ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ బొజ్జపల్లి సుభాష్ గారి బీజేపీ కుటుంబంలో చేరిన నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
👉రాబోయే రోజుల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం గడ్డ మీద కాషాయ జెండా ఎగరవేయాలని అన్నారు.
👉స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు చేస్తున్న అరాచకాలు అంతా ఇంతా కాదు ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు.
👉ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇద్దరి చేతుల స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గo బందిఖానా అయింది.
👉త్వరలో మీ ఇద్దరికీ స్టేషన్ ఘనపూర్ ప్రజలు స్వస్తి పలికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
🚩బిజెపి చేరినా వారిలో గ్రామ BRS వార్డు మెంబర్, ఎలగందుల అశోక్, కొలిపాక మహేందర్,బత్తిని సాంబరాజు, బత్తిని నాగరాజు, బత్తిని శ్రీకాంత్, బత్తిని శివప్రసాద్, కెషోజు శివ సాయి తదితరులు ఉన్నారు..* ▪️ఈ కార్యక్రమంలో బిజెపి సోషల్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగాల కార్తిక్ రెడ్డి, శక్తి కేంద్ర ఇంచార్జ్ తాళ్లపల్లి కిషోర్ గౌడ్, బూత్ అధ్యక్షులు ఒగ్గు సాంబరాజు, బల్ల రాజు, తాళ్లపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.