
టికెఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ వలి.
ఆత్మకూరు : రాజ్యాంగ పదవిలో ఉన్న బిజెపికి చెందిన కేంద్ర హోంమంత్రి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు చెస్తూ ముస్లిం ల రిజర్వేషన్లు రద్దు చేస్తామనడం పట్ల తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన కేంద్ర హోంమంత్రిగా హోదాలో ఉన్న అమిత్ షా ముస్లిం మైనార్టీలలో అభద్రతాభావం పెంపొందించేలా వాక్యాలు చేయడం దేశ ప్రయోజనాలకు దెబ్బ తీస్తుందన్నారు. ఇలాంటి వాక్యాలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదని స్పష్టం చేశారు.భారత దేశంలో దాదాపు 30 కోట్ల ముస్లిం ఉన్నారు. ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లను దండుకొని బిజెపి అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు. బిజెపి నాయకులు ముస్లిం పట్ల రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడడం బాధాకరమన్నారు.