ఆటో నుండి కిందపడి యువకుడు మృతి
చికిత్స పొందుతూ 14 రోజుల తర్వాత మృతి
• పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆటో నుండి కిందపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువకుడు మరణించిన సంఘటన వర్ధన్నపేట మండలంలో చోటుచేసుకుంది.భవానికుంట తండా వాసి ఆంగోతు జాధ్య తండ్రి వాస్రం, 58, ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇదే నెలలో 14 తారీకు ఉదయం 9:30 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి అన్నారం షరీఫ్ వద్దకు కందూరుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా,సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో కొడుకు ఆంగోతు నరేష్, 30,ఆటోలో ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో నుండి కిందపడ్డారు.ఈ ప్రమాదంలో ఎడమ చేయికి, తల వెనుక భాగంలో దెబ్బలు తగిలాయి.వెంటనే పేరికేడులోని వైద్యుడి వద్దకు, అక్కడి నుండి వర్ధన్నపేట లక్ష్మీ గణపతి ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని అమృత న్యూరో సర్జన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5:30 గంటలకు నరేష్ మరణించారు.ఈ మేరకు పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.