చౌటపల్లిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 2
పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామం లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మట్టపల్లి వంశీ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ యర్యకర్తల నడుమ గ్రామ పార్టీ అధ్యక్షులు మట్టపెల్లి వంశీ రావు జాతీయ జెండా మరియు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది.మన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకోవడం కోసం కెసిఆర్ తన ప్రాణాలకు తెగించి చావు నోట్లో తలపెట్టి 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు అలాగే తెలంగాణ సాధన కోసం చాలామంది యువత తమ ప్రాణాలను కోల్పోయారు కెసిఆర్ కృషి పట్టుదల యువకుల ప్రాణ త్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది.తెలంగాణ రాష్ట్రం సాధించుకొని నేటికీ 14 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా పండగల జరుపుకోవడం జరిగింది.ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారు బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టపెల్లి పెద్ద మాధవరావు, చిన్న మాధవరావు, గోపాల్ రావు, తోట స్వామి, చిడిమల్ల అశోక్, గౌరారపు కుమారస్వామి , దేవరాజ్ , దామెర కళ్యాణ్ , కోతి పాపయ్య , గడ్డం క్రిష్ట , జోరు సూర్య , నీలం రామయ్య , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు , కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు