గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్
:గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
విద్యార్థులు పరిచయం లేని ఎవరిని పడితే వారిని నమ్మి మోసపోవద్దని గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్ హెచ్చరించారు.అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులతో మాట్లాడటం, పరిచయం లేనివారితో స్నేహం చేయడం ప్రమాదకరమని తెలిపారు.మానవ అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలంటే విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరూ సమాజంలో అప్రమత్తంగా మసలుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్,డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కంప అక్షయ, డి.ఎల్.ఎస్.ఏ మెంబర్ మంగళపల్లి రాజ్ కుమార్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.