కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా
వర్ధన్నపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైస సురేష్ కుమార్ తండ్రి మైస ఉప్పలయ్య అనారోగ్యంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఆసుపత్రికి వెళ్లి ఉప్పలయ్యను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పలయ్యకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. “నమ్ముకున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి కంటికి రెప్పలా కాపాడుకుంటాను” అని భరోసా ఇచ్చారు