గ్రామ సర్పంచ్ గాడుదుల రమేష్ యాదవ్
గ్రామ సర్పంచ్ గాడుదుల రమేష్ యాదవ్
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 8 :
పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ గ్రామపంచాయతీలో గ్రామసభ గ్రామ సర్పంచ్ గాడుదుల రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామ సర్పంచ్ గాడుదుల రమేష్ యాదవ్ మాట్లాడుతూ..పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామ ప్రజలు తడి పొడి చెత్తను వేరుచేసి గ్రీన్- బ్లూ బకెట్లలోనే వెయ్యాలని తద్వారా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారని అన్నారు.అలాగే గ్రామంలోని పలు సమస్యలపై మాట్లాడుతూ నీటి సమస్య,కరెంటు సమస్య,రోడ్లపై చెత్త లేకుండా సిబ్బందితో పనులు చేపిస్తానని అన్నారు.అలాగే మన గవర్నమెంట్ పాఠశాలలోనే పిల్లలను చేర్పించి పాఠశాల యాజమాన్యానికి సహకరించి ఉన్నత విద్యను తమ పిల్లలకు అందించాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు.ఈ గ్రామసభ సమావేశానికి గ్రామపంచాయతీ సెక్రటరీ,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్లు,గ్రామ పార్టీ అధ్యక్షులు,వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్,హార్టికల్చర్ ఆఫీసర్,జి పి ఓ సార్,హై స్కూల్ హెడ్మాస్టర్స్,గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు,నాయకులు పాల్గొన్నారు.