డీసీసీ కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ఎమ్మెల్యే నాగరాజు
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ కడియం కావ్య, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి పాల్గొని కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దారి దోపిడీ ప్రభుత్వంగా అభివర్ణించారు.గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజల కోసం పనిచేస్తుందన్నారు.వర్ధన్నపేటలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అభివృద్ధిపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరిగిన దోపిడీని ప్రజలు గమనించారని, ప్రతిపక్ష నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలు రాష్ట్రానికి చేసింది లేదని, ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్లు,జిల్లా, నియోజకవర్గ,మండల ప్రజాప్రతినిధులు,ముఖ్య నేతలు, యువజన,మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.