తెలంగాణ వీర నారి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. తెలంగాణ రజక సంఘం
Suryapetతెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ. సిపిఐ జిల్లా నాయకులు సిహెచ్ సీతారాం.
గళం న్యూస్ మునగాల సెప్టెంబర్ 26
తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన చాకలి ఐలమ్మ జీవితం చరిత్రలో చిరస్మరణీయం అని సిపిఐ పార్టీ జిల్లా నాయకులు, తెలంగాణ రజక సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ సీతారాం అన్నారు, మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక చిల్లంచర్ల రఘునాథం స్మారక భవన్ నందు ఐలమ్మ 124వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ. రాజకారుల పెత్తందారుల బానిసత్వాన్ని వెట్టి చాకిరి నుంచి ప్రజలను విముక్తి చేయడానికి జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి చాకలి ఐలమ్మ అన్నారు, చాకలి ఐలమ్మ పోరాట చరిత్ర తెగువ భవిష్యత్ తరాలకు పదిలంగా ఉండేందుకు ఐలమ్మ విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు. నాటి సాయిధ పోరాటంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది అని ,ఐలమ్మ పోరాట స్ఫూర్తి తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ప్రపంచానికి తెలంగాణ బిడ్డల వీరత్వాన్ని సాటి చెప్పిందని అలాంటి వీరవనిత ఆశయాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని వారు తెలిపారు, భవిష్యత్తు తెలంగాణ సమాజం ఐలమ్మ ఆశయాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి జక్కుల వీరశేఖర్, సిపిఎం పట్టణ కార్యదర్శి గడ్డం వినోద్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సారెడ్డి రాఘవరెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కాసర్ల రాజేష్, డివైఎఫ్ఐ మండల నాయకుడు దేవరం శ్యామ్, తోకల బద్రి ,చింతకాయల ఎల్లయ్య, నెమ్మాది శ్రీకాంత్, రజక సంఘం నాయకులు తంగేళ్ల మంగయ్య, గరిపాకుల సతీష్, ప్రభాకర్, సట్టు గోపి ,వీరబాబు, తంగేళ్ల శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.