ఫాతిమా చేపల అడ్డా వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో చేపల మార్కెట్‌ను నిర్మించాలి.
Hanamkonda*TMKMKS జిల్లా కార్యదర్శి గొడుగు వెంకట్ డిమాండ్ *
ఈ రోజు (అక్టోబర్ 25న) తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మికసంఘం (TMKMKS) ఈ నెల 30 న జరుగు జిల్లా సదస్సు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఫాతిమా అడ్డా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది.
అనంతరం జరిగిన ఫాతిమా చేపల అడ్డా సమావేశంలో జిల్ల్లా ప్రధాన కార్యదర్శి గొడుగు వెంకట్ మాట్లాడుతూ.., మార్కెట్ సౌకర్యం లేక ఫాతిమా చేపల అడ్డవద్ద రోడ్ పైన చేపలు అమ్ముతూ అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ చేపల అడ్డా వద్ద వెనుక ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చేపల మార్కెట్ కు గతంలోనే కేటాయించారని, కానీ నేటి వరకు చేపల మార్కెట్ నిర్మించలేదన్నారు. వెంటనే చేపల మార్కెట్‌ను నిర్మించి మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరమైన వరంగల్ మహానగరం (వరంగల్, హనుమకొండ, కాజిపేట) అన్నారు. ఈ మహానగరంలో 10 ఎకరాల స్థలం కేటాయించి రూ. 50 కోట్లతో 10 ఎకరాల స్థలం కేటాయించి రూ. 50 కోట్లతో హోల్ సేల్ చేపల మార్కెట్‌ను నిర్మించాలని ఆయన డిమాండ్ చేసారు. ఫలితంగా మత్స్యకారులకు ఉపాధి, ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు రాష్ట్రవ్యాపితంగా మత్స్య సంపదను అందించవచ్చునన్నారు. అలాగే వరంగల్ నగరంలో ప్రతి కార్పోరేషన్ డివిజన్లో శాశ్వత రిటైల్ ఫిష్ మార్కెట్స్ ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం వలన మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుందని, ఎందుకంటే గత సంవత్సరంలో వేసిన చేప పిల్లలు ఇప్పటికి 100 నుండి 200 గ్రాముల కంటే ఎక్కువ సైజ్ పెరగడం లేదు. నాసిరకం చేప పిల్లలు ఇవ్వడం, ఇచ్చే చేప పిల్లలు కూడ సీజన్ సమయంలో కాకుండా ఇస్తుండడం వలన మత్స్య కారులకు తీవ్ర నష్టం జరుగుతుంది, అందుకే ప్రతి మత్స్య సొసైటీ బ్యాంకు అకౌంటులో నేరుగా నగదు జమ చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో TMKMKS ఫాతిమా చేపల అడ్డా అధ్యక్షులు రమేష్ బాబు, లక్ష్మి, రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.