తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన ఎం.డి. నూరున్నీసా
తెలుగు గళం న్యూస్ జనగామ, జూన్ 10
జాఫర్గడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన ఎం.డి. నూరున్నీసా భారత మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారత మహిళా సమాఖ్య మహాసభలో ఆమెను ఏకగ్రీవంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి తెలిపారు.ఈ సందర్భంగా నూరున్నీసా మాట్లాడుతూ, తనను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న సంఘ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, వివక్షకు వ్యతిరేకంగా మహిళలను చైతన్యపరిచి సమీకరిస్తూ ఉద్యమాలు చేపడతానని పేర్కొన్నారు.మహిళల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆమె తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ప్రజాతంత్రవాద నాయకులకు, మహిళా సంఘ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మహిళా సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా పనిచేస్తానని నూరున్నీసా స్పష్టం చేశారు.