మహా యజ్ఞోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
Adilabadతలమడుగు మండలంలోని పల్సి-బి తాండ లో ప్రతి ఏటా ఎంతో ఘనంగా జరిగే సంత్ శ్రీ సద్గురు నారాయణ బాబా 27వ అఖండ హరినామ మహా యజ్ఞోనోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారితో కలిసి పాల్గొని గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు నారాయణ బాబాని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారు మాట్లాడుతూ ముందుగా ఆశ్రమాన్ని నడుపుతూ ఎంతో మందిలో నారాయణ బాబా గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కిషన్ మహరాజ్ గారిని అభినందించారు. అదేవిధంగా ఒక నిరుపేద రైతు కుటుంబంలో మహారాష్ట్ర లోని కిణ్వట్ తాలూకా అంబటి గ్రామంలో జన్మించిన నారాయణ బాబా ఈరోజు దాదాపు ఎన్నో గ్రామాల్లో భక్తుల గుండెల్లో నిలిచిపోయారన్నారు. నారాయణ బాబా గారు తనయొక్క భోదనలతో అందరిని ఆకట్టుకునేవారు అని ఆయన యొక్క భావాలు ఆలోచనలు ఈరోజు ఎంతో మంది భక్తులు ముందుకు తీసుకెళ్తున్నారని మేమంతా మీ వెంట ఉంటమని తెలిపారు. అలాగే పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చి కుల మతాలకు అతీతంగా పాటలు పాడుతూ మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే అని మనం పూజించే మందిరాలు వేరు కావచ్చు కానీ దేవుడు ఒక్కడే అని పాటతో అందరిని అల్లడించిన మొహమ్మద్ రఫీ గారి ఆలోచనలు గొప్పవని అన్నారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకటేష్, అధికార ప్రతినిధి మోట్టే కిరణ్ కుమార్, జడ్పీటీసీ గణేష్ రెడ్డి, ఎంపిపి రాజేశ్వర్, పిఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రాథోడ్ రమేష్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్, బలరాం జాధవ్, నాయకులు ప్రకాష్, దూస సంతోష్, రాంబాయి, పల్లవి గార్లతో పాటు తదితర నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.