మహిళలు ఆర్ధికంగా పైకి వస్తే ఆ కుటుంబం అంతా పైకి వస్తుంది
Jangaonమహిళల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు అనేక పథకాలు పెట్టారు
కుట్టు మిషన్ల శిక్షణ ద్వారా కుటుంబానికి చేయూత లభిస్తుంది
రాష్ట్రానికి మంత్రి అయినా పాలకుర్తికి దయన్ననే…
సోలార్ పవర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కంటి వెలుగు కార్యక్రమం దేశంలో చాలా గొప్పది
రాయపర్తిలో కుట్టు మిషన్ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
(పాలకుర్తి నియోజకవర్గం, జనవరి 25)
ఒక కుటుంబంలో మహిళ ఆర్ధికంగా బలపడితే ఆ కుటుంబం మొత్తం బలపడుతుంది అని, అందుకే మహిళలను పైకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ గారు అనేక పథకాలు పేట్టి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు.
పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తిలో నేడు కుట్టు మిషన్ల ఉచిత శిక్షణా తరగతులను మంత్రి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు…
మహిళలను ఆర్ధికంగా పైకి తీసుకురావడం వల్ల ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది.
నేను రాష్ట్రానికి మంత్రి అయినా మీకు దయన్ననే.
గతంలో మహిళలు బయటకు రావడానికి కూడా ఆలోచించే వారు.
ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉన్నారు.
మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు మహానుభావులు ఎన్టీ రామారావు పెట్టారు.
సీఎం కేసీఆర్ గారు మహిళల కోసం అనేక కార్యక్రమాలు పెట్టి వారిని పటిష్ట పరుస్తున్నారు.
సీఎం కేసీఆర్ గారు దూర దృష్టితో మహిళలను అభివృద్ధి చేస్తున్నారు.
నేను బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తిరిగాను. మన దగ్గర ఉన్నట్లు ఎక్కడా కూడా 2000 రూపాయల పెన్షన్ లేదు.
బిజెపి కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో ఇచ్చే 500, 600 రూపాయల పెన్షన్ కూడా ఇల్లు ఉంటే బంద్… కార్ ఉంటే బంద్ మన దగ్గర నౌకరీ ఉంటే తప్ప అందరికీ ఇస్తున్నాం.
బిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చే కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిన మహానుభావులు సీఎం కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడా లేదు.
గర్భిణీ స్త్రీకి నొప్పులు వస్తే ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి వేల, వేల రూపాయలు ఖర్చు చేసేది. కానీ నేడు ఫోన్ చేస్తే ప్రభుత్వ వాహనం వచ్చి సర్కారు దవాఖానకు తీసుకెళ్లి ప్రసవం చేయిస్తున్నారు.
ప్రసవం అయ్యాక కేసిఆర్ కిట్ ఇచ్చి 12వేల రూపాయలు ఇస్తున్నారు.
గర్భిణీలు ఆపరేషన్లు తప్పనిసరి అయితే తప్ప చేయించుకోవద్దు. ఆపరేషన్ చేయించుకుంటే మహిళకు అనేక ఇబ్బందులు ఉంటాయి.
ఆపరేషన్ చేస్తే బిడ్డకు చనుబాలు ఇవ్వలేరు. తల్లిపాలు తాగితేనే పిల్లలు మంచిగా ఎదుగుతారు. వారికి జ్ఞానం బాగా వస్తుంది. చురుకుగా ఉంటారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి.
గతంలో నీటికోసం కుండలు, బిందెలు పట్టుకుని రోడ్ల వెంట వెళ్ళేది. సీఎం కేసీఆర్ గారు 40వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మిషన్ భగీరథ తెచ్చారు. మహిళలకు నీటి బాధను శాశ్వతంగా తొలగించారు.
సీఎం కేసీఆర్ గారు ప్రజలకు సేవ చేసేందుకు నాకు మంచి శాఖలు ఇచ్చారు.
మీ మహిళా సంఘాల మంత్రి, మిషన్ భగీరథ మంత్రి పని నాకు ఇచ్చారు.
గ్రామంలో అనేక సమస్యలు తీర్చే అవకాశం నాకు ఇచ్చారు.
మహిళలకు మంచి చేసే ఈ కుట్టు మిషన్ల కోసం సీఎం కేసీఆర్ గారి వద్దకు వెళ్తే మంచి ఆలోచన చేశావు అన్నారు. వెంటనే ప్రారంభించేందుకు ప్రోత్సహించారు.
దీంతో ఈ పథకాన్ని మొదట పాలకుర్తి నియోజకవర్గంలో పెట్టాను. ప్రతి మహిళకు శిక్షణ ఇచ్చే వరకు ఇది కొనసాగుతుంది.
దీంతో పాటు సోలార్ పవర్ పథకాన్ని కూడా పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రారంభం చేస్తున్నాను. దీనిని మీరు సద్వినియోగం చేసుకోవాలి.
ఈ పథకంలో లక్ష రూపాయలు స్త్రీ నిధి నుంచి రుణం అందుతుంది. 40 వేలు సబ్సిడీ వస్తుంది. 3వేలు మీరు పెట్టుకుంటే సరిపోతుంది. 5 ఏళ్ల పాటు నెలకు 2243 రూపాయలు చెల్లిస్తే సొంతం అవుతుంది. 30 ఏళ్లు బిల్లు లేకుండా కరెంట్ వస్తుంది.
పాలకుర్తి కి గొప్ప చరిత్ర ఉంది. రామాయణం రాసింది వాల్మీకి మన దగ్గర ఉన్న వల్మిడిలో. భాగవతం రాసిన పోతన పుట్టింది పాలకుర్తి దగ్గర్లోని బమ్మెర లో. ప్రజలకు అర్దం అయ్యే విధంగా తెలుగులో రాసిన ఆదికవి పాల్కురికి సోమనాథుడు ఇక్కడే పుట్టాడు.
వీరందరి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ఈ ఆలయాలను పెద్ద ఎత్తున అభివృద్ది చేశాం. ఆ మహా కవుల విగ్రహాలను భారీ ఎత్తున పెడుతున్నాం.
పర్వత గిరిలో కూడా కాకతీయుల కాలం నాటి గుడిని ఈనెల 26,27,28 తేదీల్లో పునః ప్రతిష్ట చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో భాగంగా కంటి వెలుగు క్యాంప్ పరిశీలించారు. కంటి వెలుగు ఈ దేశంలోనే గొప్ప పథకం అన్నారు.
ఈ ప్రతిష్ట కార్యక్రమానికి మీరు కుటుంబ సభ్యులతో వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలి.
ఈ కార్యక్రమంలో వరంగల్
కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్ శ్రీమతి అశ్విని తానాజీ వాకడే , డి.ఆర్. డి. ఓ సంపత్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు పాల్గొన్నారు.