వసతి గృహాల హెచ్ఎంలు వార్డెన్ లతో ప్రత్యేక సమావేశం
Bhadradri Kothagudemనిర్మాణం చేపట్టే భవనం గట్టిగా ఉండాలంటే పునాది అనేది పటిష్టంగా నిర్మించినట్లే గిరిజన పిల్లల చదువు అభివృద్ధి చెండాలంటే విద్య యొక్క పునాది గట్టిగా ఉండాలని, మీ పిల్లలను ఏ విధంగా చదివించుకుంటున్నారో గిరిజన పిల్లలను కూడా మీ పిల్లల భావించి చక్కటి విద్య అందించాలని, ఆ దిశగా -హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు. మంగళవారం) నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల, వసతి గృహాల హెచ్ఎం, వార్డెన్ లతో గిరిజన విద్యార్థిని విద్యార్థుల చదువుపై పదవ తరగతి ఫలితాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థిని, విద్యార్ధుల యొక్క చదువు అనేది పటిష్టంగా ఉండాలంటే ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపయిన్ నిర్వహించి పిల్లలకు విద్య పట్ల మక్కువ కలిగేలా చూడవలసిన బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపై ఉందని, ఆదివారం మినహాయించి ఇతర సెలవు రోజుల్లో కూడా పిల్లలకు స్పెషల్ తరగతులు పాఠశాలలో తీసుకోవాలని, ఐదవ తరగతి వరకు చదివే పిల్లలు వర్క్ బుక్ చదివేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. బదో తరగతి వరకు చదివే పిల్లలు అభ్యాసికల మీద ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పాఠశాల పని దినాలలో మాత్రం ఏ ఒక్క ఉపాధ్యాయుడు గైర్హాజరు కాకూడదని తప్పనిసరిగా పిల్లలపై శ్రద్ధ చూపి, విద్యాబుద్ధులు నేర్పించాలని, జిపిఎస్ పాఠశాలలో చదివే పిల్లలు 95 శాతం పిల్లలు పేరాగ్రాఫ్ చదివే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలని అన్నారు. ప్రతి పాఠశాలలో డ్యూయల్ డెస్క్ బల్లలు తప్పనిసరిగా ఉంటాయని పిల్లలు క్లాస్ రూములకు ప్రవేశించేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు ధరించి ఉండాలని, పాదరక్షలు ఎవరు బయట విడవకుండా చూడాలని, ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా డ్యూయల్ జెస్క్ బల్లలు ఉండాలని, ఎక్కడైనా లేవని మా దృష్టికి వస్తే సంబంధిత ఏ టి డి వోలు, హెచ్ ఎం ల పై శాఖ పారమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే ప్రతి పాఠశాలలో వాచ్మెన్ తప్పనిసరిగా ఉండాలని, ముఖ్యంగా బాలికల ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహించే సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాలు అంకంపాలెం, డి గొల్లగూడెం ఆశ్రమపాఠశాలలు మినహాయించి, మిగతా పాఠశాలల్లో చాలా తక్కువగా వచ్చిందని ఇకముందు ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఇంగ్లీష్, సైన్స్ గణితం, సబ్జెక్టులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100% రిజల్ట్ వచ్చేలా హెచ్ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు, కృషి చేయాలని అన్నారు. పదో తరగతి పరీక్షలలో ఏ గ్రేడ్ సాధించిన అంకంపాలెం హెచ్ఎం వెంకటేశ్వర్లు డి గొల్లగూడెం హెచ్ఎం
విజయలక్ష్మిని ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజున వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నానని అన్నారు. పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది పనితీరు బాగా లేకపోతే సి సి ఏ రూల్స్ ప్రకారము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పదవ తరగతి పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉండని వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మీ పైన ఉందని, వారిని చదువు పట్ల పై స్థాయికి తీసుకొని పోవడానికి అహర్నిశలు పనిచేసి వారి విద్యాభివృద్ధికి తోడ్పాటు అందించాలని అన్నారు. మీ తరగతి గదులలో లైబ్రరీ, స్టోర్, నిర్వహిస్తున్నారని కానీ తరగతి గదులు మాత్రం విద్యార్థులకే ఉపయోగించాలని, కంప్యూటర్ ల్యాబు నిర్వహించుకోవాలని పిల్లల చదువుకు మాత్రం ఎటువంటి కలగకూడదని అన్నారు. వర్షాకాలం నడుస్తున్నందున పాఠశాలల్లో వర్షపు నీరు నిలువ లేకుండా చూడాలని, పాఠశాలలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, పాఠశాలల పైన వర్షపు నీరు ఉండడం వలన పాఠశాల పైకప్పులు తొందరగా పాడైపోవడానికి అస్కారం ఉంటుందని, నిలువ నీరు ఉండకుండా చూడాలని, 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మంగళవారం శుక్రవారం డ్రైడేగా పాటించి పాఠశాలలు శుభ్రం చేసుకోవాలని అలాగే హరితహారం లో భాగంగా అందమైన పూల మొక్కలు, ఆకుకూరలకు సంబంధించినవి. సంబంధించినవి మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చూడాలని ఆ దిశగా సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాలల్లో మైనర్ రిపేర్ల కొరకు త్వరలో హెచ్ఎం లకు నిధులు విడుదల చేస్తామని, పాఠశాలలకు కావలసిన ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు వివరాలు అవసరం అయినవి ప్రతిపాదనలు పంపిస్తే హెచ్ఎం కి పంపించే నిధుల నుండి సమకూర్చుకోవచ్చని అన్నారు. ఎస్సీ ఈ ఆర్ని హెచ్ఎం ల పరిధిలోని జీపి పాఠశాలలను వారానికి ఒకసారి సందర్శించి పిల్లల యొక్క చదువు ఏ విధంగా జరుగుతున్నది గమనిస్తూ ఉండాలని, మెనూ ప్రకారం ఆహారం అందుతున్నది లేనిది చూడాలని ప్రతి పాఠశాల పరిధిలో మిషన్ భగీరథకు సంబంధించిన మంచినీరు సరఫరా అవుతున్నదని తప్పనిసరిగా ఆ నీటిని వేడి చేసి చల్లబరిసిన తర్వాతనే పిల్లలకు అందించాలని, పిల్లలు
డ్రాప్ అవుట్ కాకుండా చూడవలసిన బాధ్యత మీ పైన ఉందని, తల్లిదండ్రులు వచ్చిన పిల్లలు ఎవరిని ఇంటికి పంపకూడదని, ఏదైనా పాఠశాలల్లో టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ సరఫరా అవడంలో జాప్యం జరిగితే, గత సంవత్సరం చదివిన పిల్లల దగ్గర నుంచి తీసుకున్న టెస్ట్ బుక్స్, బుక్ బ్యాంకు ఏర్పాటు చేసి కొత్త టెస్ట్ బుక్స్ వచ్చేవరకు వాటి ద్వారానే ఇప్పుడున్న పిల్లలకు విద్యాబోధన చేయాలని, వాచ్మెన్లు లేని చోట అక్కడున్న నాలుగో తరగతి సిబ్బందికి విధులు నిర్వహించే బాధ్యత అప్ప చెప్పాలని, ఎవరైనా సిబ్బంది వినకుంటే వివరాలు తెలియజేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సపరేటుగా జరుగుతుందని అన్నారు. ఎవరైనా పిల్లలు అనారోగ్యానికి గురి అయితే వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని, ఆ విషయం తప్పనిసరిగా మా దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. సెలవు రోజుల్లో కాకుండా ప్రతిరోజు ప్రధానోపాధ్యాయులు టీచర్లు, అందరూ స్థానికంగానే ఉండాలని, ఎవరైనా హెచ్ఎంలు సెలవు పెడితే పై అధికారుల దృష్టికి తీసుకొని పోయి సెలవు శాంక్షన్ చేసుకున్న తర్వాతనే వెళ్లాలని అన్నారు. ఈనెల 25 వరకు పాఠశాలల్లో నీ గిరిజన విద్యార్థిని విద్యార్థుల పట్ల తీసుకున్న సౌకర్యాల గురించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు తయారుచేసి సక్రమంగా పాఠశాలలు నడిచే విధంగా చూడాలని అన్నారు. పదవ తరగతి ఫలితాలు రావడానికి నిర్లక్ష్యం వహించిన ఏ హెచ్ ఎస్ ఖమ్మం హెచ్ఎం టీచర్లను పనిష్మెంట్ గా మారుమూల గుండాల ఆశ్రమ పాఠశాలకు పంపించాలని, అలాగే ఎస్ టి బి హెచ్ వార్డెన్ పివి ప్రాజెక్ట్ హెచ్ఎం రాంబాబును చర్లకు పంపించాలని, పాఠశాలల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకు ఖమ్మం ఏసీఎంఓ.. రాములను ఆ హెూదా నుంచి తొలగించాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఖమ్మం కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జన్చార్జి ఆర్ సి ఓ గురుకులం డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఖమ్మం డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కృష్ణా నాయక్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ క తానాజీ, ఎసీఎంవో రమణయ్య, రాములు, ఏటీడీవోలు.. నరసింగరావు, తిరుమలరావు, రూపా దేవి, చంద్రమోహన్ జి సి డి ఓ అలివేలు మంగతాయారు, వివిధ పాఠశాలల హెచ్ఎంలు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు