వేంసూరు లో విఓఏ ల విన్నూత్న నిరసన
ఖమ్మంజిల్లా వేంసూరు మండల కేంద్రం లోని మండల కార్యాలయాల ఎదుట విఓఏ లు చేస్తున్న నిరవధిక సమ్మె ఆదివారంతో పద్నాలుగో రోజుకు చేరింది.ఆందోళనకు ఆదివారం సెలవు కాదంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ సమ్మె శిబిరం వద్ద మోకాళ్ళపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆట ఆడుతూ పాట పాడుతూ ప్రభుత్వానికి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో: కాటూరి మణి,వరకా శృంగారం,శేషు కుమారి,కిన్నెర సుగుణ,సీతారత్నం,సునీత,పుష్ప,పిల్లి జ్యోతి, బి.జయమ్మ,రత్నకుమారి, అల్లి మల్లీశ్వరి,భవానీ తదితరులు పాల్గొన్నారు.
Nice