ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని విద్యాజ్యోతి డిగ్రీ కళాశాల బీకాం మూడవ సంవత్సరం విద్యార్థులు విద్యా ప్రయోజనాల నిమిత్తం శుక్రవారం హైదరాబాద్,నాచారం లోని రేనేవో ప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను పరిశీలన కోసం సందర్శించారు.ఈ పరిశ్రమ సందర్శనలో కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ తామస్ కిరణ్,కామర్స్ విభాగాధిపతి మధు బాబు కంప్యూటర్ విభాగం నుండి రాజ్ కుమార్ సార్ గారు విద్యార్థులకు తోడుగా పాల్గొన్నారు.విద్యార్థులు ఉత్సాహంగా ఈ పరిశ్రమలో జరిగే తయారీ ప్రక్రియలను పరిశీలించి,అక్కడి వాతావరణం,యంత్రాలు,నిర్వహణ విధానాలపై అవగాహన పొందారు.ఇలాంటి పరిశ్రమ సందర్శనలు విద్యార్థుల సైద్ధాంతిక పరిజ్ఞానానికి అనుసంధానంగా ప్రాక్టికల్ అనుభవం కలిగించడంలో కీలకంగా నిలుస్తాయని అధ్యాపకులు అభిప్రాయపడ్డారు.