రేవంత్ రెడ్డి,కడియం శ్రీహరి జాగ్రత్త
Jangaon, Telanganaబీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తే తెలంగాణ అగ్నిగుండమవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రంగా హెచ్చరించారు.సోమవారం నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్లజెండా బైక్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా,సాగునీరు అందించడంలో విఫలమైందని మండిపడ్డారు.రాజయ్య మాట్లాడుతూ..“బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు 17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పుష్కలంగా అందించాం.రైతులు ఎప్పుడూ ఇబ్బంది పడలేదు.కానీ నేడు యూరియా కోసం క్యూలలో నిలబడే పరిస్థితి ఏర్పడింది”అన్నారు.కడియం శ్రీహరి ఘన్‌పూర్‌లో యూరియా కొరత లేదని చెప్పడం అవాస్తవమని,స్థానికంగా వెళ్లి చూసినప్పుడు స్టాక్ లేదని బోర్డు పెట్టారని విమర్శించారు.దేవాదుల ప్రాజెక్ట్ పనులు అవినీతి కారణంగా నిలిచిపోయాయని ఆరోపిస్తూ..“రూ.104 కోట్లతో మంజూరైన మూడు ఎత్తిపోతలలో పనులు సగానికి మించి జరిగాయి.కానీ బిల్లుల కోసం 20–30% కమిషన్ డిమాండ్ చేస్తూ పనులు ఆగిపోయాయి.గుండ్లసాగరం రెండో లిఫ్ట్ సిద్ధంగా ఉన్నా నీళ్లు విడుదల చేయలేదు.నష్కల్ మూడో లిఫ్ట్ ప్రారంభమైనా పనులు జరగలేదు”అని వివరించారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని రాజయ్య ఆరోపించారు.“లక్షల ఎకరాలకు సాగునీరు అందించే చరిత్ర కేసీఆర్ ది.కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చంపి,ఆంధ్రాకు నీళ్లు తరలించే బనకచర్ల ప్రాజెక్ట్‌ను బ్రతికించాలని కాంగ్రెస్ చూస్తోంది. సీబీఐ దర్యాప్తు పేరిట కేసీఆర్‌ను జైలుకు పంపే యత్నం జరుగుతోంది” అన్నారు.కడియం శ్రీహరిపై కూడా రాజయ్య తీవ్రంగా వ్యాఖ్యానించారు.“నేను దొంగనేనని కడియం స్వయంగా ఒప్పుకున్నాడు.పార్టీ మార్చి ఏడాది అయినా ఒక్క పనీ చేయలేదు.నిన్న చేసిన పాదయాత్రకు భయపడి కొత్త నాటకం ఆడుతున్నాడు.రేవంత్ దగ్గర డబ్బులు అడుగుతున్నాడు”అని ఆరోపించారు.చివరగా ఆయన “దేవాదుల పనులు 90% పూర్తయ్యాయి.పేపర్ స్టేట్మెంట్లు కాకుండా పనులు ప్రారంభించాలి.ఘన్పూర్ నియోజకవర్గంలోని ఒక్క ఊరుకీ నీరు అందకుండా ఉండకూడదు.రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదు.అవసరమైతే మూడు లిఫ్ట్‌ల వద్ద మళ్లీ పాదయాత్రలు చేస్తాం”అని స్పష్టం చేశారు.