ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సత్తుపల్లి నియోజకవర్గం ఎప్పుడు కేసీఆర్ వెంటే అని మరోసారి నిరూపితం అయింది నియోజకవర్గ ప్రజల ఆదరణ అభిమానం మరువలేనిది ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా హృదయపూర్వక ధన్యవాదాలు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఖమ్మం జిల్లా పర్యటన విజయవంతం కావడం పట్ల సత్తుపల్లి శాసనసభ్యులుసండ్ర వెంకట వీరయ్య గారు హర్షం వ్యక్తం చేశారు సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ కి మద్దతుగా నిలవడంలో ఎప్పుడు ముందుంటామనే సంకేతాన్ని కల్పించినందుకు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. అట్లాగే సీఎం గారి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఏర్పాటుచేసిన జిల్లా అధికారులు,ఉద్యోగులు, సిబ్బందికి, అభినందనలు తెలిపారు. బహిరంగ సభ విజయవంతాన్ని కృషిచేసిన సత్తుపల్లి నియోజకవర్గ ఐదు మండలాల ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.