కల్లూరు బస్టాండులో సేవా స్ఫూర్తి
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు మండల కేంద్రంలోని బస్టాండులో శుక్రవారం బొగ్గుల బస్విరెడ్డి 80వ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బస్విరెడ్డి కుమారులు కృష్ణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు.
వేసవి వేడిలో దాహం తీర్చే ఈ కార్యక్రమాన్ని ప్రయాణికులు అభినందించారు. సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
సత్తుపల్లి ఆర్టీసీ డిపో బృందం తరఫున బస్విరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి,వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో: పల్లె వెలుగు బస్ మేనేజర్ కిన్నెర ఆనంద్,జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పసుమర్తి సీతా చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.