వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వాలి
ఖమ్మంజిల్లా కామేపల్లి
మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో గెలుపొందిన వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వార్డు మెంబర్లు శుక్రవారం ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. పింజరమడుగు గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బాదావత్ శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.మండల పరిధిలోని 24 గ్రామపంచాయతీలకు చెందిన 59 శివారు గ్రామాల్లో గెలిచిన 116 మంది వార్డు సభ్యులు ఉన్నారు.వీరికి నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా హాజరు కాలేకపోతున్నారని తెలిపారు.వార్డు సభ్యులలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీ కుటుంబాలకు చెందిన వారే కావడంతో రోజువారీగా మండల కేంద్రానికి రావడం కష్టమవుతోందన్నారు.
శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనే వార్డు సభ్యులకు రోజుకు రూ.500 చొప్పున ప్రయాణ భత్యం ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.3 వేల గౌరవ వేతనం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, గ్రామాభివృద్ధి పనుల్లో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
ఎంపీడీఓ స్పందన
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంపీడీవో సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో:మండలంలోని వార్డు సభ్యులు పాల్గొన్నారు.