తెలంగాణ ఏర్పాటుపై బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏ విధంగా న్యాయం చేశాయి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా ఆరోజు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిందా. కాంగ్రెస్ ఎంపీలు ఆరోజు పార్లమెంటు తలుపులు మూసి పెప్పర్స్ స్ప్రే లు ఉపయోగించి బిల్లును ఆపాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా చూడాలని ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నం చేశారు అన్నది కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోజు ఏ పార్టీలో ఉన్నారు అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా మద్దతు పలికారు ఎంత పని చేశారనేది ప్రజలకు తెలియదా. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోజు పార్లమెంట్లో జరిగిన విషయాన్ని ప్రత్యక్షంగా వీక్షించలేదా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ విభజన శాస్త్రీయంగా జరిగింది.ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తానని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని లిఖితపూర్వకంగా అమలు చేయకపోవడం వల్ల రెండు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని మాత్రమే ఎంపీ మాట్లాడారు తప్ప తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలను కించపరిచే విధంగా చూడాలని బెంగుళూరు ఎంపీ తేజస్వి సూర్య చూడలేదని ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల గురించి మాత్రమే పార్లమెంట్లో గుర్తుచేసి వారికి అన్యాయం జరుగుతుందని విషయాన్ని గుర్తు చేశారని అవి గమనించకుండా బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీలు భారతీయ జనతా పార్టీపై నిందలు వేయడం సమంజసంగా లేదని తెలంగాణ ఏర్పడడానికి ఆరోజు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు తెలుసని విద్యార్థులు ఎవరూ చనిపోవద్దని మీకోసం మేము పోరాడుతాం మీరందరూ తెలంగాణ కోసం బతికి ఉండాలని పార్లమెంటు వేదికగా సుష్మ స్వరాజ్ మాట్లాడారని ఆ మాటలు తెలియని కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు భారతీయ జనతా పార్టీని విమర్శించడం తగదని బిజెపి జిల్లా నాయకులు కొందరు మహేందర్ రెడ్డి రెండు పార్టీలను విమర్శించారు. ఇప్పటికైనా రెండు పార్టీలు బుద్ధి తెచ్చుకొని తెలంగాణ అభివృద్ధి కోసం పని చేయాలని హితవు పలికారు. రాష్ట్రంలో సమస్యలే లేనట్టు రైతులు ఒకపక్క పండించిన పంట ను అమ్ముకోవడానికి మార్కెట్లలో ఇబ్బంది పడతా ఉంటే ఆ సమస్యలను పట్టించుకోకుండా ప్రతిపక్ష మరియు అధికారపక్ష నాయకులు సూదిలో దారం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలను తీర్చడం కోసం పనిచేయాలని బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈతో పలికారు.