వి.ఏం. బంజర లో మెగా నేత్ర వైద్య శిబిరం
ప్రారంభించిన పోలీస్ ఏసిపి వసుంధర యాదవ్”
సేవే నా దృక్పథం:జెన్నారెడ్డి నరసింహారెడ్డి(విశ్రాంత పోలీస్ సీఐ)
శ్రీ రాజసాయి మందిరం ఫౌండర్ విజయ జ్ఞాపకార్ధం క్యాంప్”
ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని పెనుబల్లి మండలంలోని వి.ఏం.బంజర పట్టణంలో కొలువై యున్న షిర్డీ సాయిబాబా శ్రీ రాజసాయి మందిరం ఫౌండర్ జెన్నారెడ్డి విజయ జ్ఞాపకార్ధం వారి భర్త విశ్రాంత పోలీస్ సీఐ జెన్నారెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బంజరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కిరణ్ నేత్ర వైద్యశాల కాకినాడ వారి సహకారంతో మెగా నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.అట్టి శిబిరాన్ని కల్లూరు పోలీస్ ఎసిపి వసుంధర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి పరీక్షలను ప్రారంభించారు.రోగులకు పరీక్షలు చేసే అన్ని గదులను ఆమె స్వయంగా తిరిగి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.శిబిరం పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.వృద్ధాప్యంలో కూడా విశ్రాంతి తీసుకోకుండా సమాజ సేవ చేసే దానికి కృషి చేస్తున్న జెన్నారెడ్డి నరసింహారెడ్డి ను అభినందించారు.అనంతరం నిర్వాహకులు వసుంధర యాదవ్ కు శాలువా కప్పి పుష్పాలు వేసి ఘనంగా సత్కరించారు.ముందుగా వసుంధర యాదవ్ కు సంప్రదాయ మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు.ఆమెతో పాటు పోలీస్ ఎస్ఐ,సిబ్బంది ఉన్నారు.ఈ శిబిరానికి చుట్టుపక్కల గల సత్తుపల్లి,వేంసూరు,కల్లూరు,తల్లాడ,పెనుబల్లి,తిరువూరు మండలాల నుండి నేత్ర సమస్యలు ఉన్న ప్రజలు ఎండను సైతం లెక్కచేయకుండా భారీగా తరలి వచ్చారు.వారి దాహార్తిని తీర్చే దానికి స్థానికంగా గల వాటర్ సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకులు గుడ్ల లక్ష్మణరావు ఉచిత మసాల మజ్జిగ పంపిణీ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు పట్టణానికి చెందిన జనరల్ మెడిసిన్ ప్రముఖ వైద్యులు ఉయ్యూరు చెన్నారెడ్డి తమ ఆసుపత్రి తరపున షుగర్,బీపీ మందులను ఉచితంగా పంపిణీ చేశారు.అనంతరం నిర్వాహకులు జెన్నారెడ్డి విజయ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సేవే నా దృక్పథం అని అన్నారు.నాలుగు లక్షల నేత్ర శస్త్ర చికిత్సలు చేసిన అపార అనుభవం కలిగిన కాకినాడ కిరణ్ నేత్ర వైద్యశాల వారు ఆరు ఏళ్లుగా అడుగుతుంటే నేటికి మూడొందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని వారికి,పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు,పలు సేవలు చేసిన జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్.విద్యార్థులకు,విశ్రాంత ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.మొత్తంగా 462 మంది పాల్గొని పరీక్షలు చేయించుకోగా వారిలో 150 మందికి శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు నిర్ధారణ చేసినట్లు దానిలో తక్షణమే 70 మంది రోగులను కిరణ్ నేత్ర వైద్యశాల వారు ఉచిత బస్సులలో కాకినాడ ఆసుపత్రికి శస్త్ర చికిత్స చేయడానికి తరలించారని స్పష్టం చేశారు.చికిత్స అనంతరం వారిని తిరిగి మరలా వారే బంజర కు ఈ నెల 21 వ తేదీ మంగళవారం పంపుతారని,మిగిలిన 80 మందిని ఈ నెల 22 వ తేదీ బుధవారం శస్త్ర చికిత్స కొరకు తీసుకెళ్తారని తెలిపారు.శ్రీ రాజసాయి మందిరం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాల్లో ఇప్పటికీ 11 వేల పై చిలుకు మంది ఆపరేషన్ లు చేయించుకొని తిరిగి కంటి చూపును పొందారని బాబా కృపతో ముందుకు సాగుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో: ఎల్.వి.ఆర్.కె.దత్తు,టీచర్ మామిళ్ళపల్లి నరసింహారావు,వనమా నాగేశ్వరరావు,ఎన్ఎస్ఎస్ రత్నాకర్,అన్నపురెడ్డి శ్రీనివాస్,సైకిల్ శ్రీను, కె.శివకృష్ణ, నీలాపు ఉమారాణి, జె.జ్యోతి,భీమిరెడ్డి శ్యామల,సాయిమణికంఠ తదితరులు పాల్గొన్నారు.