దాతల సేవలకు ప్రజల ప్రశంసలు
– దాతల సేవలకు ప్రజల ప్రశంసలు
తెలుగు గళం న్యూస్ కొడకండ్ల, జూన్ 8
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహించిన చలివేంద్రం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. తీవ్ర ఎండల నేపథ్యంలో 45 రోజుల పాటు ఉచిత మంచినీరు, 35 రోజుల పాటు మజ్జిగ పంపిణీ నిర్వహించి వేలాది మంది బాటసారులు, కూలీలు, వాహనదారులు, ప్రయాణికుల దాహార్తిని తీర్చింది.చలివేంద్రం ముగింపు సందర్భంగా కడగుట్ట తండాకు చెందిన కీ.శే. మాలోతు శంకర్ గారి ఆరు నెలల జ్ఞాపకార్థంగా ఆయన సతీమణి మాలోతు పార్వతి సౌజన్యంతో సుమారు 250 మంది బాటసారులు, కూలీలు, ప్రయాణికులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. దీంతో 35 రోజులుగా కొనసాగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం పూర్తయింది.సుమారు రూ.70 వేల వ్యయంతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం మండుతున్న ఎండల్లో ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించింది.బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, రైతులు, కూలీలు, ప్రయాణికులు చల్లని నీరు, మజ్జిగ సేవించి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని కొడకండ్ల ప్రజలు, యువత, పెద్దలు ప్రశంసించారు.ఈ సందర్భంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. పెదపూడి ప్రసన్న ఇటీవల బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా అందుకున్న “పర్యావరణ మిత్ర జాతీయ అవార్డు”ను సంస్థకు సహకరించిన ప్రతి దాతకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమానికి కొడకండ్లతో పాటు నైజీరియా, ముంబై, సూరత్, విజయవాడ, హైదరాబాద్, హన్మకొండ, ఏడునూతుల, రంగాపురం, నర్సింగాపురం తదితర ప్రాంతాల నుంచి పలువురు దాతలు సహకరించారు.చలివేంద్రం విజయవంతం కావడానికి దోర్ణం ప్రభాకర్, దగడ్ సాయి అయ్యప్ప హోటల్ యాజమాన్యం, చెన్న ఆగయ్య, చెన్న ఉపేందర్, కొమ్ముకూరి ప్రవీణ్, బొల్లి కుమార్, బొల్లి మహేందర్, ముక్కెర శ్రీకాంత్, భూక్య నితిన్, టైలర్ ధర్మేందర్, ఆటో మహమ్మద్, వీరదాసు నవీన్, నరేందర్, భూక్య సోమ్లా, పోస్ట్ అశోక్, మేడుదుల చిన్నపెల్లి అంకిత, పెట్లోజు నాగరాజు, ముక్కెర నాగరాజు, నేతి సాయి, నింగాల కిరణ్, మార్గం శారద, కడారి ఉపేందర్, జవ్వాజి జ్ఞానానందం, జాటోత్ భాలాజీ తదితరులు విశేష సహకారం అందించారు.అలాగే ప్రతిరోజూ చల్లని నీటి క్యాన్లు అందిస్తూ సేవలందించిన హనీ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు జవ్వాజి శ్రావణ్‌కు, కార్యక్రమ నిర్వహణలో సహకరించిన డెన్ని, బెన్ని మరియు ఇతర స్వచ్ఛంద సేవకులకు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సేవా కార్యక్రమం సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.