తహసీల్దార్ వెంకటస్వామి హెచ్చరిక
-తహసీల్దార్ వెంకటస్వామి హెచ్చరిక
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 8
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో చెరువును కబ్జా చేసి, ఎఫ్టీఎల్ లో మట్టి పోసి ఫ్లాట్లు వేయాలని చూస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వ్యవహారంపై సోమవారం పర్వతగిరి తహసీల్దార్ టి. వెంకటస్వామి తన సిబ్బందితో కలిసి చెరువు ప్రాంతాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరైనా మట్టి నింపితే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎఫ్టీఎల్లో మట్టి పోసిన వారికి నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూమిని ఎవరైనా ఆక్రమించే ప్రయత్నం చేస్తే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని తహసీల్దార్ స్పష్టం చేశారు.