పర్వతగిరి మండలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం
-ఎంఈఓ పిలుపు
పర్వతగిరి మండలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రారంభం
తెలుగు గళం న్యూస్ పర్వతగిరి/జూన్ 8
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు అందించినట్లు మండల విద్యాశాఖాధికారి ఏ.బిక్షపతి తెలిపారు.పర్వతగిరి మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పాఠశాలల పునఃప్రారంభ తేదీకి ముందే అన్ని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్, వర్క్ బుక్స్,యూనిఫాం,మధ్యాహ్న భోజనం అందిస్తోందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఎంఆర్సి సిబ్బంది శిల్ప,జయరాజ్,సీఆర్పీలు ప్రవీణ్,సుధ,శ్రీనివాస్,లోకేష్ తదితరులు పాల్గొన్నారు.