వనమాల కనపర్తిలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం
అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాలు దిద్దించిన సర్పంచ్ ఎల్లస్వామి వనమాల కనపర్తి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రేపాక ఎల్లస్వామి ముఖ్యఅతిథిగా హాజరై చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లస్వామి మాట్లాడుతూ,”చిన్నారులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలి.తల్లిదండ్రులు పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నాం”అని అన్నారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు మెంబర్ నాతి రవళిక, 4వ వార్డు మెంబర్ రేపాక వినయ్, అంగన్వాడీ టీచర్,ఆయా, చిన్నారులు,వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు.