ఆరోగ్య సమస్యలతో విరక్తి పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
పర్వతగిరి మండలం ధూప తండాకు చెందిన గుగులోతు కొమ్మాలు (60) అనే వృద్ధుడు ఆరోగ్య సమస్యలతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతుడి కుమార్తె బానోతు మంజుల (30) ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధూప తండాకు చెందిన లేబర్ కొమ్మాలు గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది గురువారం ఇంట్లో ఉన్న గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు.గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కొమ్మాలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.మృతుడి కుమార్తె మంజుల ఫిర్యాదు మేరకు పర్వతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.