రైతు భరోసాపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి ఫైర్
రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది తప్ప, రైతులకు పూర్తి స్పష్టత ఇవ్వడం లేదు. చేసేది గోరంత… ప్రచారం కొండంత అన్నట్లుగా ఉంది” అని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ విమర్శించారు.
పర్వతగిరి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 30 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేసి 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన స్వాగతించదగ్గదేనని, కానీ ఈ విడతలో ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాల వరకు భరోసా అందిస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ హయాంలో సభలు లేకుండానే జమ
“గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు నిధులు ఎలాంటి ఆర్భాట సభలు, ప్రచారం లేకుండానే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేవి.కానీ ఇప్పుడు ప్రతి విడత నిధుల విడుదలకు భారీ బహిరంగ సభలు, ప్రచార హంగామా కనిపిస్తోంది” అని ఆరూరి ఎద్దేవా చేశారు.పూర్తి స్థాయిలో అందలేదుకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పంట సీజన్‌కైనా రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా అందలేదనే ఆందోళన ఉందని ఆయన పేర్కొన్నారు. “ఇటీవల రబీ సీజన్లో అనేక సభలు నిర్వహించినా, రైతులకు గరిష్టంగా 2 ఎకరాల వరకు మాత్రమే నిధులు విడుదల చేశారు”అని గుర్తు చేశారు.
ప్రచారానికి కాదు, సంక్షేమానికి ఖర్చు చేయాలి
“రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెబుతున్న ప్రభుత్వం,ప్రజాధనాన్ని ఆర్భాట కార్యక్రమాలపై ఖర్చు చేయకుండా నేరుగా రైతుల సంక్షేమానికే వినియోగించాలి. రైతులకు కావాల్సింది సభలు కాదు, ప్రచారం కాదు.స్పష్టత,సమయానికి నిధుల జమ,ఇచ్చిన హామీల అమలు”అని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు