భూపాలపల్లిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల హక్కుల కోసం నియంతృత్వ పోకడలపై రాజీలేని పోరాటం చేస్తున్న పోరాట యోధుడు, జననాయకుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత,లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత ఘనంగా జరిగాయి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైపాల్ రెడ్డిల పిలుపు మరియు ఆదేశాల మేరకు ఈ వేడుకలను నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని హెచ్ఎమ్ఆర్డీఎస్ దివ్యాంగుల స్వచ్ఛంద సేవా సంస్థలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా, సేవా కార్యక్రమాలతో జరిపారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు, దివ్యాంగ విద్యార్థుల సమక్షంలో యువజన కాంగ్రెస్ నాయకులు భారీ కేక్‌ను కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు.అనంతరం ఆశ్రమంలోని విద్యార్థులందరికీ చదువుకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు మరియు పండ్లను (ఫ్రూట్స్) పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశంలో విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను ఏకం చేసిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలపై ఆయన మరింత గళం విప్పుతున్నారని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజాసేవలో గడిపే తమ నాయకుడి పుట్టినరోజును ఇలా దివ్యాంగుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఘనమైన జన్మదిన వేడుకల కార్యక్రమంలో భూపాలపల్లి అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు నాగునూరి రజినీకాంత్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చుంచుల మహేష్, అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ బడితల ప్రసాద్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీకాంత్, ఉమ్మడి రేగొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోయిల క్రాంతి, చిట్యాల మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొమ్మ కిరణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రభుదాస్, కీర్తి రాజు, గణపాక కోటి తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు