అగ్నివీర్‌గా ఎంపికైన షేక్ నెమత్కు అహ్మదియా జమాత్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
ఆత్మకూరు మండలం హౌజ్ బుజుర్గు గ్రామానికి చెందిన షేక్ నెమత్ ఇటీవల ఇండియన్ ఆర్మీలో ‘అగ్నివీర్’గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా హౌజ్ బుజుర్గు గ్రామంలోని అహ్మదియా ముస్లిం జమాత్ సంస్థ ఆధ్వర్యంలో షేక్ నెమత్తో పాటు ఆయన తండ్రిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అహ్మదియా ముస్లిం జమాత్ సంస్థ హన్మకొండ జిల్లా ఇంచార్జ్ మొహమ్మద్ ఉస్మాన్, గ్రామ సంస్థ అధ్యక్షులు సయ్యద్ వలి పాల్గొని నెమత్ను అభినందించారు. దేశ సేవలో అగ్నివీర్‌గా ఎంపికై గ్రామానికి మరియు సంస్థకు గర్వకారం అని మంచి పేరు తెచ్చిన నెమత్ యువతకు ఆదర్శంగా నిలిచారని వారు కొనియాడారు.
ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ గురువు మాసూద్, కరీం, అక్బర్, అజ్గర్, కమిటీ సభ్యులు ఉమర్, యాకుబ్, కరీం, ఇఫ్తాకర్, మూజైద్, జావీద్, దావుద్, ముబారక్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు