భగవత్ నామస్మరణే అన్ని శుభాలకు మూలం… జ్ఞానేశ్ భక్త్ గురువర్యా అర్జున్ మహారాజ్ లాడ్……// ఆదిలాబాద్ జిల్లా మండల పరిధిలోని నర్సాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా తేది 13-04-2023 నుండి 20-04-2023 వరకు కొనసాగుతున్న రామకృష్ణ నామ సంకీర్తన కార్యక్రమం వైభవంగా ముగిసింది. రామకృష్ణ హరే నామ సంకీర్తన కార్యక్రమం రాబోయే తరాలకు వారసత్వ సంపదను అందించే ఒక మహత్తర కార్యమని, వారం రోజులపాటుగా సాగిన ఈ కార్యక్రమం వల్ల గ్రామంలో ఒక అద్భుతమైన శక్తి విరసిల్లి ప్రతి ఒక్కరి ధ్యానంలో ఆ భగవంతుని నామస్మరణే ఉండడం విశేషమని, భగవత్ నామస్మరణే అన్ని శుభాలకు మూలమని.. 250 గడపలు గల ఇంత చిన్న గ్రామంలో 17 అడుగుల ఎత్తు, 12వేల స్క్వేర్ ఫీట్ల దేవాలయ మండపం కోసం ఒకే గంటలో ఒక కోటి రూపాయలు జమ కావడం దైవం యొక్క కృపా కటాక్షములే అని, ఈశ్వరుని దయ ఉంటే అన్ని మంచి జరుగుతాయని, భగవంతుడు ఎవరైతే నిత్యం తన పేరు తలుస్తారో వారినే ఇష్టపడతాడని సకల శుభాలు ఇస్తాడని ఈ సందర్భంగా భక్తులనుదేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రామ్ చందర్ తిడ్కే, ధ్రువ పటేల్ ముండే, మాణిక్రావు ముండే, దేవదాస్ టీచర్, సకారం, రామచంద్ర ముస్లే, గణేష్ ముండే, మరియు భగవాన్ బాబా యూత్ ఈ వారం రోజులు చక్కని ఏర్పాటు చేశారు. ఈరోజు సామూహిక అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున సాంప్రదాయ వంటకం పురన్పోలి చేపట్టడం జరిగింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *