ఏన్టీఆర్ జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ ( దిశా) చైర్మన్ విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ నాని మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు దిశా కమిటీ మెంబర్ సెక్రెటరీ ఆదేశాలు ప్రకారం నందిగామ సిడిపిఓ పరిధిలోగల నందిగామ బీసీ కాలనీ అంగన్వాడి సెంటర్ ను సందర్శించిన ఎన్టీఆర్ జిల్లా డెవలప్మెంట్ కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు శ్రీ ఎక్కిరాల హనుమంతరావు ఏపీ హైకోర్టు న్యాయవాది, సందర్శించిపిల్లల యొక్క మొత్తం హాజరు పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం గుడ్లు పాలు, పప్పు, బాలామృతం వివరాలను అడిగి తెలుసుకుని బాలింతలు గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి వివరాలను అడిగి పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అంగనవాడి మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించి టైం ప్రకారం అంగన్వాడీలో పిల్లలు, ఆయాలు, అంగన్వాడీ టీచర్లు ఉండే విధంగా చూసుకోవాలని, మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు ఆహారాన్ని అందించి, మంచి విద్య బుద్ధులు నేర్పించాలని పలుచూచనాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *