ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడాలి
ఎస్ఐఆర్ డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి పెండ్లి రఘువీర్ రెడ్డి
ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు తమ సమయాన్ని కేటాయించి ప్రతి ఓటును కాపాడేందుకు కృషి చేయాలని డోర్నకల్ నియోజకవర్గ ఎస్ఐఆర్ ఇన్చార్జ్ పెండ్లి రఘువీర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం దంతాలపల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో నర్సింహులపేట మరియు దంతాలపల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు ఎస్ఐఆర్ అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టీపీసీసీ కోఆర్డినేటర్ అవిజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెండ్లి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి బీఎల్ఏ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ఒక్క ఓటు కూడా తొలగించబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఓటును మ్యాపింగ్ చేయడంతో పాటు అర్హులైన కొత్త ఓటర్లను నమోదు చేయాలని కోరారు.ఎస్ఐఆర్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దంతాలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బట్టు నాయక్, నర్సింహులపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు జింకల రమేష్, యువ నాయకులు సతీష్, హరికృష్ణ, బీఎల్ఏలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.