కంకర పరిచారు.. బిటి మరిచారు..!

మండల పరిధిలోని రత్నవరం గ్రామం నుండి మునగాల మండలం ఆకుపాముల గ్రామం వరకు సుమారు 7 కి. మీ. పాత రోడ్డు గుంతలు ఏర్పడంతో నూతన బిటీ రోడ్డు నిర్మాణం కోసం 6 నెలల క్రితం పాత రోడ్డు ను తవ్వి కంకర,డస్ట్ పరిచిన అనంతరం కాంట్రాక్టర్ బిటీ రోడ్డు వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం తో పోసిన కంకర వర్షాలకు పైకి తేలడంతో ఆటో,ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ రహదారి మీదుగా రత్నవరం, చాకిరాల,శ్రీరంగాపురం, రామాపురం,ఇ. కె. పేట, తెల్లబల్లి గ్రామాల ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు.రహదారి అధ్వానంగా మారడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వలనే బిటి రోడ్డు నిర్మాణం ఆలస్యం అవుతుందని వాహనాదారులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు పూర్తిచేసే విధంగా కృషి చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఆర్ &బి ఏ ఈ సత్యనారాయణ వివరణ : బిటీ రోడ్డు కాంట్రాక్టర్ వేరే వేరే ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు పూర్తి చేస్తుండటంతో ఈ రోడ్డు నిర్మాణం కొంత ఆలస్యం జరిగిందని…సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి… రెండు,మూడు రోజులలో పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *