కల్లెడలో "స్వామి వివేకానంద రన్" విజయవంతం
*220 మంది యువతతో 5 కి.మీ స్నేహపూర్వక పరుగు
*ఎస్ఐ బి. ప్రవీణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలోని ఆర్డీఎఫ్-వనితా అచ్చుతా పాయి విద్యాలయ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో “స్వామి వివేకానంద రన్-కల్లెడ” పేరుతో 5 కిలోమీటర్ల స్నేహపూర్వక పరుగు పందెం ఆదివారం విజయవంతంగా జరిగింది.ఉదయం 7 గంటలకు కళాశాల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి పర్వతగిరి ఎస్ఐ బి. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి పరుగును ప్రారంభించారు. ఈ పరుగు కల్లెడ కళాశాల నుంచి ప్రారంభమై పర్వతగిరి పర్వతాల శివాలయం వరకు 5 కిలోమీటర్ల మేర సాగింది.
ఈ సందర్భంగా ఎస్ఐ బి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ,యువత ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడంతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ,క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు.ఇలాంటి కార్యక్రమాలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు సామాజిక బాధ్యతను పెంచుతాయని అన్నారు. పరుగులో మొదటి 10 మంది బాలురు, బాలికలను అభినందించి ప్రోత్సహించారు. అనంతరం పాల్గొన్న వారందరికీ స్నాక్స్ అందజేసారు.కళాశాల ప్రధానాచార్యులు ఆడెపు జనార్ధన్ మాట్లాడుతూ,మండలంలోని వివిధ పాఠశాలల నుంచి 220 మంది విద్యార్థులు,యువత, క్రీడాకారులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.ప్రతి నెల మూడో ఆదివారం జరిగే ఈ పరుగులో యువత ఎక్కువగా పాల్గొని ఆరోగ్యకరమైన జీవన విధానం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల విద్యావిభాగం అధిపతి రమేష్ కుమార్,ఉప ప్రధానాచార్యులు ఎ. రాజు,అధికారి సతీష్, అధ్యాపకులు జయశంకర్, మహేశ్వర్,సంతోష్,సైదులు,దంజ్య, గుంషావళి, ప్రవీణ్ శ్రీలత,ధనలక్ష్మి, తిరుమల,పిడి రాజు,రమేష్,వేణు తదితరులు పాల్గొన్నారు