నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చాలు
ఏనుగల్లు లో పోలియో చుక్కల వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ తొర్రి పద్మ – కుమార్
నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు చాలని గ్రామ సర్పంచ్ తొర్రి పద్మ-కుమార్ గ్రామ ప్రజలకు తెలిపారు. పర్వతగిరి మండల లోని ఏనుగల్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని సర్పంచ్ ఏ ఎన్ ఏం కలిసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని అటహాసంగా ప్రారంభించారు. సర్పంచ్ స్వయంగా పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాలు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని మండల ప్రజలకు సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ,అంగన్వాడీ టీచర్, వైద్య సిబ్బంది గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.