స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు
స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి స్నేహబంధం, మానవత్వాన్ని చాటుకున్నారు.చదువు కున్న బాల్య తరగతి మిత్రులు ఇటీవల అంకతి మల్లేశం మృతి చెందాడు. తోటి మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంకతి మల్లేశం కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడు అందించాలనే ఉద్దేశంతో బ్యాచ్ కు చెందిన మిత్రులు కలిసి రు. 10.500/- సేకరించిన నగదును సోమవారం దశదిన కార్యక్రమం సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమన్నారు.భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధార అభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మద్య మెదలాడుతూనే ఉంటాయన్నారు. మిత్రుడు కుటుంబానికి ఎల్లవేళలా తమ వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.అంకతి మల్లేశం లేని లోటు ఎప్పటికీ పూడ్చలేదని అన్నారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా తమ వంతు సహకారం అందిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కష్టంలో ఉన్న కుటుంబానికి తోటి మిత్రునికి ఆర్థిక సాయం చేసిన సందర్భంగా సహకరించిన మిత్రులందరికీ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పలువురు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.కుమార్ కల్లెడ , ఎన్.సాంబయ్య పర్వతగిరి, రాంగోపాల్ వడ్లకొండ, బి. జితేందర్, పర్వతగిరి, టి. ఉపేందర్ గుంటూరు పల్లి, సారంగా పాణి పర్వతగిరి, మల్లిఖార్జున్ నగరం, జి. ప్రేమ్ కుమార్ సోమారం, కిసన్ రోళ్లకల్, ఇబ్రహీం వడ్లకొండ, జి. మహేందర్ బూర్గు మడ్ల, బాసాని శ్రీనివాస్ పర్వతగిరి మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.