
స్టేషన్ ఘన్పూర్/చిల్పూర్ ఏప్రిల్ 16
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలంలోని ఎంపీటీసీలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.నిన్న చిల్పూర్ మండల ఎంపీపీ బొమ్మిశెట్టి సరిత బాలరాజు చేసిన సవాలును స్వీకరిస్తూ మేము బహిరంగ చర్చకు సిద్ధమే అని అన్నారు.ఎంపీపీ 20 లక్షల రూపాయలు స్వాహా చేశారని ఎంపిటిసి లు ఆరోపణలు చేయగా శుక్రవారం ఎంపీపీ మీడియా సమావేశం పెట్టి అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని సోమవారం ఉదయం 10గంటలకు మండల కార్యాలయంలో కూర్చుంటానని అన్నారు.దీనితో శనివారం ఎంపీటీసీలు స్పందించి ప్రెస్ మీట్ పెట్టి సవాలును స్వీకరిస్తున్నట్లుగా ప్రకటించారు.వారు మాట్లాడుతూ..మా వెనుక ఏ బడా నాయకుడు లేడని, మా గౌరవం తగ్గించడం వల్లే అవిశ్వాసానికి వెళ్ళామని, అందరం కలిసి తీసుకున్న నిర్ణయమే అని అన్నారు. తీర్మానం పుస్తకంతో చర్చకు రావాలని అన్నారు.మీరు చేసిన పనులలో తీర్మానం పుస్తకంలో మా సంతకాలు ఉంటే మేము ముకుమ్మడి రాజీనామాకు సిద్ధమని అన్నారు.