
ఏఎన్ఎంలు అరెస్ట్
నిత్యం ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా విధులు నిర్వహిస్తున్న తమకు న్యాయపరమైన హక్కులను కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను వెళ్ళనీయకుండా ప్రభుత్వం పోలీసులచే తమను అరెస్టు చేయడం అమానుషమని ఏఎన్ఎంలు స్టేషన్ ముందు నిరసన వ్యక్తం పరిచారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు సంగేపు సుచరిత బెజవాడ నరసమ్మ అనంతుల లలిత భానుమతి పద్మ తదితరులు పాల్గొన్నారు