
ఈ69న్యూస్ జనగామ
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు)ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మిక న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీస్ ను యూనియన్ జిల్లా నేతలు డిపిఓ స్వరూపకు సమ్మె నోటీసు ఇచ్చారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు మాట్లాడుతూ..గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 40 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలను నమ్ముకుని సేవలు చేస్తున్నా కనీస వేతనాలు గాని ఉద్యోగ భద్రత గాని లేనటువంటి పరిస్థితి దాపురించిందని ప్రతి నెల వేతనాలు రాని పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి స్వయంగా జనవరి నుండి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తానన్న హామీ నేటికి నెరవేరలేదని గత ప్రభుత్వంలో ఇప్పటి మంత్రులు స్వయంగా కనీస వేతనాలు అమలు చేస్తానని మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేస్తానని ఉద్యోగ భద్రత కల్పిస్తానని 34 రోజుల సమ్మె సందర్భంగా అనేక హామీలు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలని అమలు చేస్తుందని గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లిస్తూ చెక్కులు జారీ చేయించినప్పటికీ ఎస్టీవో లలో నిధులు లేక నిలిచిపోయాయి తప్ప వేతనాలు వచ్చిన పరిస్థితి లేదని గత ఆరు నెలలుగా ఆగిపోయిన వేతనాలు చెల్లించాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 ద్వారా నైపుణ్యం లేని పనులు చేయించడం వల్ల రాష్ట్రంలో 200 పైన కార్మికులు చనిపోయారని ఇన్సూరెన్స్ సౌకర్యం లేక ఆ కుటుంబాలు వీధిన పడ్డాయని పంచాయతీలలో దాదాపు 90 శాతం దళితులని వివక్షతతో మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయకుండా ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తుందని 51 జీవో సవరించాలని మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని పర్మినెంట్ చేయాలని ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా అనేక సమ్మెలు పోరాటాలు ధర్నాలు చేస్తున్న నిప్పుల మీద నీళ్లు చల్లిన విధంగా వేతనాలు చెల్లిస్తున్నారని ఇచ్చే వేతనాలు కూడా 9,500 అందరికీ అందడం లేదని ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి స్వయంగా మా యూనియన్ తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకొస్తానన్న ప్రభుత్వం మా గ్రామం పంచాయతీ కార్మికులలో మార్పు రావాలంటే మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయడానికి మా యూనియన్ తో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులతో చర్చలు జరిపించి.మా సమస్యలను పరిష్కరించాలని లేనియెడల ఈనెల 19 తర్వాత ఏరోజు నుండైన రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళుతున్నామని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమ్మెలోకి వెళ్లకముందే స్పష్టమైన ప్రకటన చేయాలని యూనియన్ రాష్ట్రనేతలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నారోజు రామచంద్రం జిల్లా నాయకులు పగిడిపల్లి మల్లేష్ తిప్పారపు యాకుబ్ జే మహేందర్ ఆర్ కృష్ణ ఉమ్మగొని రాజేష్ రాపోలు రాజ్ కుమార్ ఠాకూర్ వివేక్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.