
ఈ69న్యూస్ జనగామ
జనగామ జిల్లా వ్యాప్తంగా ఎండిన పంటలకు ప్రతి ఎకరాకు ఏమ్యూరేషన్ చేసి 50వేల నష్టపరిహారం ఇవ్వాలని దేవాదుల ప్రాజెక్టు నుండి వరద కాలువల ద్వారా జిల్లాలోని చెరువు కుంటలు నింపి రైతుల పంటలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఏవో అండాలుకు అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ…జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలలో ఎండిపోతున్న రైతుల పంటలను
ఏమ్యురేషన్ చేసి ప్రతి ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని అదేవిధంగా జనగామ జిల్లా లో దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరద కాలువల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలను నింపి రైతుల పంటలను కాపాడాలని అదేవిధంగా జిల్లావ్యాప్తంగా కాలువల కోసం భూసేకరణ చేసి సంవత్సరాలు కడుస్తున్నప్పటికీ వాటిని పూర్తి చేయకపోవడం వలన రైతాంగానికి రెండు విధాలుగా నష్టం జరుగుతున్నదని కాబట్టి తక్షణమే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కాలువలను పూర్తి చేయాలని అదేవిధంగా గ్రామాలలో తాగునీటి అవసరాల కోసం నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.అదేవిధంగా ఇప్పటికే జిల్లాలోని ఫర్టిలైజర్స్ షాపులలో కల్తీ విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు గుట్టు చప్పుడు కాకుండా గ్రామాలలో నిలువ ఉంచి రైతాంగానికి అధిక ధరలకు అమ్మి మోసం చేసే ప్రయత్నం ప్రారంభమైందని కాబట్టి జిల్లాలోని ఎరువులు విత్తనాలు ఫర్టిలైజర్ షాపులలో ఎన్ని రకాల మందులు రసాయనాలు క్రిమిసంహారక మందులు వీటితోపాటు విత్తనాలు విక్రయిస్తున్నారో బోర్డు ఏర్పాటు చేసి ఎంత ధరలకు అమ్ముతున్నారో రోజువారి నిలువలు ఎంత ఉన్నాయో తెలుపుతూ సూచికను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువల ద్వారా చెరువులు కుంటలు నింపాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల సారయ్య మంగ బీరయ్య జిల్లా కమిటీ సభ్యులు ఉర్సుల కుమార్ బోడ రాములు నాయకులు కర్రె రాములు కర్రె సత్తయ్య కర్రె బీరయ్య రామచొక్కం
సిద్ది మల్లయ్య అసర్ల ఐల్లయ్య కర్రె శ్రీశైలం 20మంది రైతులు తదితరులు పాల్గొన్నారు.