
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ ప్రైవేట్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుదాం
కేంద్ర ప్రభుత్వం చేస్తున్నవిద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి పోరాటం నిర్వహించాలని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ మాజీ రాష్ట్ర కన్వీనర్ కే వెంకటయ్య వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ కే లింగయ్య రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కంచర్ల కుమారస్వామి పిలుపునిచ్చారు* . విద్యుత్ ఉద్యమంలోఅశువులు బాసిన సత్తెనపల్లిరామకృష్ణ 23వ వర్ధంతి సభ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో. ఈరోజు సంఘం జిల్లా అధ్యక్షులు కల్లేపల్లి బాబు అధ్యక్షతన శుక్రవారo వృత్తి సంఘాల జిల్లా కార్యాలయం రాంనగర్లో ఈరోజు విద్యుత్తు అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగానిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ 2000సం. ఆగస్టు 28న ఆనాటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ఏజెంట్ గా మారి విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై బారాలు వేసింది దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యా విధంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు విద్యుత్తు పోరాటం వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ పెద్ద ఎత్తున చలో అసెంబ్లీకి తరలి వెళ్లిన ప్రజలపై ఆరోజు టిడిపి ప్రభుత్వం బషీర్ బాగ్ చౌరస్తాలో ఆందోళన కారులపై నాటి చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం కాల్పులు జరగడంతో అక్కడికక్కడే ముగ్గురు మరణించడం. తుపాకి తూటాలకు లాటి చార్జీలకు గాయపడిన. ఆనాటి రజక వృత్తిదారు రాష్ట్ర కార్యదర్శి సత్తెనపల్లి రామకృష్ణ హాస్పిటల్లో చేరి పది రోజుల తర్వాత తన తుది శ్వాస విడ్చారు.విద్యుత్ చార్జీలు తగ్గించాలని జరిగిన పోరాటంలో నరాంతక చంద్రబాబు ప్రభుత్వాo కాల్చి చంపింది నాట్ నుండి నేటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వాలు సాహసం చేయలేదు కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ప్రవేటు బిల్లు పెట్టి విద్యుత్ చార్జీలను డిస్కౌంట్ ప్రైవేటు పరం చేయడం కోసం కృషి చేస్తుందని దీనికి వ్యతిరేకంగా బషీర్బాగ్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలు ఐక్యమై బిజెపి చేస్తున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పొట్లపల్లి రాజ్ చిట్యాల మహేష్ సవిత సంపత్ రోజా జోంతి కోమల్ స్వప్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు