ప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఘనంగా గరికపాటి రాజారావు 60వ వర్ధంతి వేడుకలుప్రజా నాట్యమండలి ఆధ్వర్యంలో ఘనంగా గరికపాటి రాజారావు 60వ వర్ధంతి వేడుకలు

జోగులాంబ గద్వాల జిల్లా ప్రజానాట్యమండలి కళాకారుల ఆధ్వర్యంలో ప్రజానాట్యమండలి వ్యవస్థాపకులు గరికపాటి రాజారావు గారి 60వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కళాకారులు పాటల ద్వారా గరికపాటి రాజారావు గారిపై పాటలు పాడుతూ…స్మరిస్తూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆశన్న మాట్లాడుతూ గరికపాటి రాజారావు సేవలు వెలకట్టలేనివాని అన్నారు.నాటి సమాజంలో దొరల పాలనకు వ్యతిరేకంగా మా భూమి నాటకంతో ప్రజలను చైతన్యపరచిన గొప్ప పోరాటాయోధుడు గరికపాటి రాజారావు అని అన్నారు.కళ కల కోసం కాదు ప్రజలకోసం అని భావించిన గొప్ప కళాకారుడు గరికపాటి రాజారావు అని అన్నారు.సమాజంలోని కళలు అంతరించిపోకుండా ప్రజానాట్యమండలి స్థాపించి ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపుటకై ఎన్నో పాటలు వ్రాసి ప్రజలను చైతన్యపరచిన గొప్ప మనిషి అన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ….గరికపాటి రాజారావు గారి ప్రాంతం ఆంద్రప్రదేశ్ అయినా కాని చదువుపరంగా సికింద్రాబాద్ లో చిన్నపాటి రూమ్ ను కిఱాయి తీసుకొని చదువున్నాడన్నారు.ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానాట్యమండలి స్థాపణకై ఆయన కృషి వెలకట్టలేనిదన్నారు.నాటి నైజాం పాలనలో తెలంగాణ ప్రాంత స్వాతంత్య్రం కై ప్రజా నాట్యామండలి ద్వారా ప్రజలను చైతన్యం చేశారన్నారు.
అదేవిధంగా చదువురీత్య మద్రాస్ డాక్టర్ కోర్సు చేస్తూనే విద్యార్థి సమస్యలపై పోరాడిన గొప్ప పోరాట యోధుడని అన్నారు.స్వంతంగా వీధి నాటకాలు రూపొందిస్తూ…సినీ రంగంలో కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారని అన్నారు.విజయవాడలో పేద ప్రజలకు వైద్యం అందించాలని గొప్ప సంకల్పంతో ఉచితంగా వైద్యం అందించారని అన్నారు.కమ్యూనిస్టు భావజాలంతో వైద్యం కోసం ఇచ్చిన డబ్బులను సమాజ అభివృద్ధికే ఖర్చుపెట్టారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ అంజనేయులు,దళిత జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్,ప్రజానాట్యమండలి గౌరవ సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి,అధ్యక్షుడు అలీ అక్బర్,కార్యదర్శి ఆశన్న,తిరుమలేష్,నర్సింహులు,ఈదన్న,తిమ్మప్ప లు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News